తెలంగాణ సమ్మె: ఉద్యోగులు వర్సెస్ ఉద్యోగులు

కాగా, ప్రభుత్వం రక్షణ కల్పిస్తే సమ్మె కాలంలో తాము విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎపిఎన్‌జివోల సంఘం అధ్యక్షుడు గోపాల్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాదులో మినహా తెలంగాణ జిల్లాల్లో తమ ఉద్యోగులకు రక్షణ లేదని ఆయన చెప్పారు. సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగించే హక్కు ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు.
కాగా, సకల జనుల సమ్మెకు మద్దతుగా సోమవారం తెలంగాణ వైద్యులు సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రి వద్ద మహా దీక్షకు దిగారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రతిపాదించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీక్షా శిబిరాన్ని తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ సందర్శించారు. తెలంగాణ ఉద్యోగుల దీక్షకు ఆయన మద్దతు ప్రకటించారు.












Click it and Unblock the Notifications