మండుతున్న బ్రిటన్, ఇతర నగరాలకు లండన్ అల్లర్లు

London Riot
లండన్: గత నాలుగు రోజులుగా లండన్ నగరం హింస, లూటీలతో అట్టుడికిపోతోంది. లండన్‌లో ప్రారంభమైన అల్లర్లు మరో మూడు ప్రధాన నగరాలకు కూడా వ్యాపించాయి. బ్రిటన్‌లో 1980 తర్వాత ఇంతటి అల్లర్లు చెలరేగడం ఇదే ప్రథమం. అల్లరి మూకలు లండన్‌లో భవనాలకు, వాహనాలకు, చెత్త కుప్పలకు నిప్పు అంటిస్తూ వెళ్లిపోయారు. పోలీసు అధికారులపైకి బాటిళ్లు, ఫైర్ వర్క్స్ రువ్వుతూ దుకాణాలను లూటీ చేస్తూ పోతున్నారు. వేసవిలో 2012 కామన్‌వెల్త్ క్రీడలు జరుగనున్న నేపథ్యంలో ఈ అల్లర్లు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

అల్లర్లు పెద్ద యెత్తున చెలరేగుతున్న జిల్లాల్లో సాయుధ బలగాలను దించాలని నిర్ణయించారు. అయినా లండన్‌లోని కొన్ని ప్రాంతాల్లో, బర్మింగ్‌హామ్ మధ్య ప్రాంతంలో, బ్రిస్టల్ పశ్చిమ ప్రాంతంలో, లివర్‌పూల్‌లోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి రావడం లేదు. అల్లర్ల వల్ల సాధారణ జనజీవితంపై తీవ్ర ప్రభావం పడింది. హోటళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని కామెరూన్ చెప్పారు. ఇప్పటికే కొంత మందిని అరెస్టు చేశామని, మరింత మందిని అరెస్టు చేస్తామని ఆయన అన్నారు.

ప్రభుత్వ వ్యయంలో కోత విధించడానికి, 2015 నాటికి లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలపై కోత విధిస్తారని ఆరోపిస్తూ ఈ అల్లర్లు ప్రారంభమయ్యాయి. ఓ నల్లజాతీయుడి ఎన్‌కౌంటర్‌తో ఈ అల్లర్లు ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అల్లర్లను అదుపు చేయడం ప్రధాని కామెరూన్‌కు అగ్నిపరీక్షగా మారింది. ఇప్పటి వరకు 450 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+