అడ్డుపడితే పాతాళంలో తొక్కేస్తాం: రాములమ్మ

ఉద్యమానికి మహిళా శక్తి అవసరం అన్నారు. మహిళల పాత్ర ఉద్యమాల్లో అమోఘం అని అన్నారు. తెలంగాణ మహిళలంతా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీమాంధ్రులు ఆస్తులు, పదవుల కోసమే కపట ఉద్యమం చేస్తున్నారని అన్నారు. తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు వారు ఆపాలని హెచ్చరించారు. తెలంగాణ వారిది ఉన్నతమైన ఉద్యమం అని అర్థం చేసుకోవాలని ఆమె సీమాంధ్ర నేతలను కోరారు. తెలంగాణ కోసం విద్యార్థులు, యువకులు ఆత్మహత్య చేసుకున్నా సీమాంధ్రుల గుండె కరగడం లేదన్నారు. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications