వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నష్టాలతో స్టాక్ మార్కెట్, 26 వేలు దాటిన బంగారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mumbai Stock Exchange
ముంబై: భారత స్టాక్ మార్కెట్ మంగళవారం సైతం భారీ నష్టాలతో ప్రారంభం అయింది. అమెరికా గ్రేడును ఎఎఎ నుండి ఎఎప్లస్ తగ్గించిన నేపథ్యంలో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇది మంగళవారం సైతం కొనసాగింది. సెన్సెక్స్ 500 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. నిఫ్టీ ఏకంగా 100 పాయింట్లు కోల్పోయింది. ప్రారంభంలోనే 17వేల పాయింట్లకు దిగువకు సెన్సెక్స్ కోల్పోయింది. సోమవారం సైతం స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభమైనాయి. భారీ ఆటుపోటుల నడుమ 550 పాయింట్లకు పైగా దిగజారినప్పటికీ చివరకు కాస్త కోలుకొని 315 పాయింట్ల నష్టంతో ముగిసింది. 16990 వద్ద ముగిసింది. సోమవారం ఒక్క రోజే ఇన్వెస్టర్లకు లక్ష కోట్ల రూపాయల నష్టం సంభవించిందని అంచనా. స్టాక్ మార్కెట్ ఇంతగా పతనం కావడం 2010 నుంచి ఇదే ప్రథమం.

సెన్సెక్స్ రోజు రోజుకు నష్టాలతో ప్రారంభం అవుతుండగా బంగారం ధర అందనంత ఎత్తుకు చేరుకుంటుంది. సోమవారం 25వేలు దాటిన బంగారం, మంగళవారం నాటికి రూ.26,200 కావడం విశేషం. అయితే ఇన్వెస్టర్లు ఎక్కడ రక్షణ ఉంటే అక్కడ తమ డబ్బును ఇన్వెస్టు చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం కన్నా బంగారం, వెండి బెట్టర్ అని భావించడం వల్లే అందులో పెట్టుబడులు పెడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

English summary
The market meltdown continued on Tuesday with the Sensex opening 500 points down. The Nifty slips below 5,000-mark for the first time since 2010.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X