రాహుల్ గాంధీకి కనిపించడం లేదా?: చంద్రబాబు

కాంగ్రెసు హయాంలో విచ్చలవిడి అవినీతి చోటు చేసుకుందన్నారు. ప్రాజెక్టుల పేరుతో లూటీ చేశారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా అవినీతిలో కూరుకు పోయాయని అన్నారు. అవినీతిపై రాజీపడే ప్రసక్తి లేదన్నారు. గతంలో టిడిపి అవినీతిపై పోరాటం చేసిందన్నారు. రాష్ట్రంలో జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందన్నారు. టిడిపి హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. అవినీతి నిర్మూలించాలంటే పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు తీసుకు రావాలని అన్నారు. రైతాంగ సమస్యలపై జాతీయస్థాయిలో ఉద్యమిస్తామని అన్నారు. సెజ్‌ల పేరుతో కాంగ్రెసు ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications