ఇద్దరు సూపర్ స్టార్స్ సంపద లెక్కకు మిక్కిలి

మోహన్‌లాల్‌కు సంబంధించి అధికారులు విలువైన కళాఖండాలను, అమూల్యమైన చిత్రాలను ఐటి అధికారులు కనుగొన్నారు. వాటి విలువ కట్టడానికి నిపుణులకు అప్పగించారు. లెక్క చెప్పని ఆదాయాన్ని ఇద్దరు నటులు కూడా రియల్ ఎస్టేట్‌లోనూ విదేశీ ఆస్తుల్లోనూ పెట్టినట్లు భావిస్తున్నారు. దేశవిదేశాల్లోని బ్యాంక్ లావాదేవీలపై ఐటి అధికారులు పరిశీలన జరుపుతున్నారు. విదేశాల్లో ఈ హీరోలు పెట్టిన చర, స్థిరాస్తుల పెట్టుబడులపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ హీరోల ఆస్తుల విలువను లెక్క కట్టే పని 2013 డిసెంబర్ 31వ తేదీకి గానీ కొలిక్కి రాదని అంటున్నారు.
చెన్నై, బెంగళూర్, కొచ్చి ఐటి అధికారులు సమన్వయంతో ఆ హీరోల ఆస్తులపై దాడులు నిర్వహించారు. దాదాపు వంద మంది అధికారులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళల్లోని 20 ఆవరణలపై దాడులు జరిగాయి.












Click it and Unblock the Notifications