బాబు తెలుగుదేశం కార్యాలయానికి వాస్తు దోషమా?

అంతేకాదు దేవుడిని బాగా నమ్మే నందమూరి హీరో బాలకృష్ణ గతంలో ఓసారి వాస్తు పండితులతో కలిసి వచ్చి ఎన్టీఆర్ భవనాన్ని పూర్తిగా పరిశీలించారు. భవనానికి ఉన్న వాస్తు దోషాలను పరిశీలించారు. తెలుగుదేశం పార్టీకి సాధారణంగా రెండు గేట్లు ఉంటాయి. ఈశాన్యంలో ఉన్న గేటును మూసి వేయాలని వాస్తు పండితులు చెప్పడంతో దానిని మూసి వేశారని సమాచారం. అంతేకాదు లైబ్రరీ వెనుక ఉన్న ఓ కట్టడాన్ని కూల్చే వేయాలని చెప్పడంతో దానిని సైతం పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇక ముందు భాగంలో స్లోప్‌గా ఉండటంతో నీరు జారినట్టే అధికారం కూడా చేజారుతుందని వాస్తు పండితులు చెప్పారంట. ఇలా ఎన్టీఆర్ భవనంలో చాలా వాస్తు దోషాలు ఉన్నాయని అందుకే టిడిపి అధికారం చేపట్టలేక పోతుందనే అనుమానం ఈ మధ్య చంద్రబాబులో సైతం కలిగిందనేది పలువురి వాదన. అందుకే వాస్తు దోషాలకు మరోసారి సరిదిద్దాలని చూస్తున్నారంట.
ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్టు భవనం ముందు భాగంలో ఎన్టీఆర్ విగ్రహం ఉంది. వాస్తు దృష్ట్యా మరో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంట. దేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేని అవకాశాలు తెలుగుదేశం పార్టీ అధికార భవనంలో ఉన్నాయంట. జిల్లాల నుండి నేతలు వచ్చినప్పుడు సమావేశాలు ఏర్పర్చుకోవడానికి ప్రత్యేక గదులు, ఓ లైబ్రరీ ఇలా దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి లేనన్ని అవకాశాలతో ఎన్టీఆర్ ట్రస్టు భవనం ఉందంట. కానీ భవనానికి ఉన్న వాస్తు దోషాల వల్లే అధికారం దూరం అవుతుందనే పలువురు తమ్ముళ్లు ఆందోళనలో ఉన్నారంట. మరి ఈసారి వాస్తు మారితే టిడిపి తలరాత మారుతుందో చూడాలి!












Click it and Unblock the Notifications