జగన్, లగడపాటిలని గజదొంగలన్న రేవంత్ రెడ్డి

జగన్ అవినీతిపరుడు, సరియైన వ్యక్తి కాదని తెలిసి లగడపాటి గతంలో వైయస్ మృతి చెందగానే ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎందుకు బలపరిచారని ప్రశ్నించారు. ఆయన అప్పుడు చెప్పింది తప్పా? ఇప్పుడు చెప్పింది తప్పా? ఆయనే చెప్పాలన్నారు. లగడపాటి చెబుతున్న మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేదన్నారు. లగడపాటి ప్రజలను మభ్యపెట్టే మాటలు మానుకోవాలన్నారు. సత్యం రామలింగరాజు వంటి వారు జైలుకు వెళ్లినప్పటికీ చాలామంది అక్రమార్కులు జైలు బయటే ఉన్నారన్నారు. లగడపాటి టిడిపితో ఉన్నప్పుడు రాజకీయ నాయకుడు కాదని అప్పటికీ ఆయనపై అవినీతి ఆరోపణలు సైతం లేవన్నారు.
తాను వ్యక్తిగత పనుల వల్లనే తెలంగాణ తెలుగుదేశం ఫోరం తరఫున ఢిల్లీకి వెళ్లలేక పోయానని అన్నారు. ఫోరంలోని ఓ ఒక్క వ్యక్తో వెళ్లనంత మాత్రాన ఆగిపోయేది ఏమీ ఉండదన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆలోచనలను తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అమలు పరుస్తారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications