పోటీకి సిద్ధమా?: లగడపాటికి పొన్నం ప్రభాకర్ సవాల్

Lagadapati Rajagopal and Ponna Prabhakar
హైదరాబాద్/కరీంనగర్: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ప్రాంతంలోని ఏ సీటు కోరినా ఖాళీ చేసి ఇస్తామని అక్కడి నుండి ఆయన పోటీ చేసి గెలిచే సత్తా ఆయనకు ఉందా అని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ఆదివారం కరీంనగర్‌లో ప్రశ్నించారు. తెలంగాణలో యాభై శాతం మంది మాత్రమే ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారన్న సర్వేలలో ఏమాత్రం నిజం లేదని కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు అన్నారు. తెలంగాణ ప్రాంతంలో సమైక్యవాదులు ఎవరైనా పోటీ చేస్తే ధరావత్తు దక్కదని అన్నారు. సీమాంధ్ర నేతలు ఎవరైనా సమైక్యాంధ్ర పేరుమీద తెలంగాణలో పోటీ చేసి ధరావత్తు పొందినా తెలంగాణ ఉద్యమాన్ని ఆపేస్తామని అన్నారు. తాను సైతం రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారు. రాజీనామాలు చేసిన 103 నియోజకవర్గాలలో ఎక్కడి నుండైనా పోటీ చేయవచ్చునని అన్నారు.

14ఎఫ్ రద్దుపై మంత్రి టిజి వెంకటేష్ ఇరుప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు నిజామాబాదులో అన్నారు. ఇప్పటికైనా టిజి వెంకటేష్, లగడపాటి రాజగోపాల్ తెలంగాణకు సహకరించాలని కోరారు. టిడిపి అధినేత చంద్రబాబు కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని ఎందుకు కలిశారో వివరణ ఇవ్వాలని మరో నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+