హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వండి: సుప్రీంకు వైయస్ జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తన ఆస్తులపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు పూర్తిస్థాయి సిబిఐ విచారణకు ఆదేశించడంపై వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనపై సిబిఐ విచారణను నిలుపుదల చేయాలని ఆయన సుప్రీం కోర్టును కోరారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సుప్రీం కోర్టులో తుది విచారణ పూర్తయ్యే వరకు తన కంపెనీలు, ఆస్తులపై జరుగుతున్న దర్యాఫ్తును ఆపాలని ఆయన సుప్రీం కోర్టుకు విన్నవించారు.

కాగా ఇటీవల సిబిఐ అధికారులు ప్రాథమిక నివేదిక సమర్పించిన అనంతరం హైకోర్టు జగన్ ఆస్తులపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించిన విషయం తెలిసిందే. జగన్ కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టి జగన్ కంపెనీలలోకి నిధులు ఎలా వచ్చాయో పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందని తీర్పు చెప్పింది. ఎమ్మార్ లోనూ అక్రమాలు జరిగాయని హైకోర్టు అభిప్రాయపడింది. ఎమ్మార్ పైనా క్రిమినల్ కేసు పెట్టి పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.

English summary
YSRC party president YS Jaganmohan Reddy went to Supreme Court today on High Court judgement on his properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X