కిరణ్ కుమార్ ప్లాన్, వైయస్ ఇమేజ్‌ను తుడిచేస్తూ..

అదే సమయంలో తన ఇమేజ్‌ను పెంచుకోవడానికి వ్యూహాలు రచించారు. సంబంధిత మంత్రులకు తెలియకుండా వాటిని అమలు చేస్తున్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డికె అరుణకు తెలియకుండా ఆయన తన పథకాలను అమలు చేస్తున్నారు. తన భారీ చిత్రాలతో ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ హోర్డింగులు ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఇందుకు సమాచార శాఖ నుంచి 27 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో వాల్ రైటింగ్స్ కూడా చేయించాలని ఆయన నిర్ణయించుకుని అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసినట్లు చెబుతున్నారు. ఇందుకు దాదాపు 180 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని చెబుతున్నారు.
ఇక మరో వ్యూహం కూడా ఆయన మదిలో ఉంది. 108 సేవలు అందిస్తున్న వాహనాలపై తన ఛాయాచిత్రాన్ని ముద్రించే ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తాను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ తెలిసేలా చేసుకోవాలనేది కిరణ్ కుమార్ రెడ్డి ప్లాన్‌గా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications