నాగంపై స్పీకర్ సీరియస్, హక్కుల ఉల్లంఘన నోటీసు

కాగా, స్పీకర్ నోటీసులకు బెదిరేది లేదని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. స్పీకర్ తమను భయపెట్టలేరని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని ఆయన అన్నారు. నాదెండ్ల మనోహర్ తెలంగాణ స్పీకర్ కాదా అని ఆయన అడిగారు. ఉరి తీస్తారా అని ఆయన అడిగారు. వంద మంది శానససభ్యులు రాజీనామాలు చేస్తే ఎవరితోనూ మాట్లాడకుండా వాటిని తిరస్కరించి స్పీకర్ విదేశాలకు వెళ్లారని ఆయన అన్నారు. రాజీనామాలను ఆమోదించలేదనే ఆగ్రహంతో తాము పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశామని ఆయన అన్నారు. ఈ మీడియా సమావేశంలో హరీశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications