చిరంజీవి వర్సెస్ వైయస్ జగన్, మారనున్న సీన్

ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తాను జగన్‌ను ఎదుర్కోవడానికి చిరంజీవి సిద్ధమైనట్లు సంకేతాలు ఇచ్చినట్లు భావిస్తున్నారు. సిబిఐ విచారణ ద్వారా జగన్ తన సచ్ఛీలతను నిరూపించుకోవాలని ఆయన అన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని సంపదను పెద్ద యెత్తున కూడబెట్టుకున్నారని చేసిన వ్యాఖ్య కూడా జగన్‌ను ఉద్దేశించి చేసిందేనని భావిస్తున్నారు. వైయస్సార్ మంత్రివర్గంలోని సభ్యులను కూడా సిబిఐ విచారణ జరిపించాలని మంత్రి పి. శంకరరావు డిమాండ్ చేయడంతో చాలా మంది గుండెల్లో గుబులు పుడుతోంది. ఈ స్థితిలో చిరంజీవి ముందుకు దూకాలని భావిస్తున్నారు. అవినీతి ఆరోపణలు లేకపోవడం, బ్లడ్ బ్యాంకుపై సినీ దంపతులు రాజశేఖర్, జీవిత చేసిన ఆరోపణలపై కమిటీ క్లీన్ చిట్ ఇవ్వడం చిరంజీవికి కలిసి వస్తుందని భావిస్తున్నారు.
కాంగ్రెసు రాజకీయాల్లో చిరంజీవి యుగం ప్రారంభమవుతుందని అంటున్నారు. ఇమేజ్ ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి కాంగ్రెసులో చిరంజీవి తప్ప మరొకరికి ఇమేజ్ లేదనే అభిప్రాయం బలంగా ఉంది. అది తనకు ఉపకరిస్తుందని ఆయన భావిస్తున్నారు. నిజ జీవితంలో ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆ మధ్య కాలంలో చిరంజీవి అన్నారు. అంటే, వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెసు తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు రావడానికి ఇప్పటి నుంచే చిరంజీవి రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications