హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఆస్తులపై ఎర్రన్నాయుడు కెవియట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yerram Naidu
హైదరాబాద్: వైయస్సాఆర్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లా సీనియర్ నేత ఎర్రన్నాయుడు మంగళవారం కెవియట్ దాఖలు చేశారు. జగన్ ఆస్తులపై హైకోర్టు పూర్తి విచారణకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)ను ఆదేశించిన నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సన్నద్దమవుతున్నారు. సోమవారం తన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగుర వేసిన అనంతరం ఆంగ్ల ప్రచార సాధనాలతో మాట్లాడిన జగన్ తాను తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళతానని చెప్పారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సైతం హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళతామని ఇటీవల చెప్పారు.

ఈ నేపథ్యంలో ఎర్రన్నాయుడు జగన్ సుప్రీం కోర్టుకు వచ్చిన నేపథ్యంలో తమను ఇంప్లీడ్ చేయాలని ఆయన కెవియట్ దాఖలు చేశారు. ఇటీవల జగన్ ఆస్తులపై హైకోర్టు సిబిఐని ప్రాథమిక దర్యాఫ్తునకు ఆదేశించిన సమయంలోనూ జగన్ సుప్రీం కోర్టుకు వెళతారనే ఉద్దేశ్యంతో టిడిపి కెవియట్ దాఖలు చేసింది. అయితే అప్పుడు కెవియట్ అవసరం లేకుండానే జగన్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురయింది. కెవియట్ దాఖలు చేయడం ద్వారా జగన్ ఆస్తులపై విచారణ జరుగుతున్న సమయంలో కెవియట్ దాఖలు చేసిన వారికి కోర్టు సమాచారం అందించి వారిని కేసులో ఇంప్లీడ్ చేయాల్సి ఉంటుంది.

English summary
Telugudesam Party senior leader Yerram Naidu filed a caveat on YSRC party chief YS Jaganmohan reddy's property today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X