అన్నాహజారేకు మద్దతుగా బాబు పాదయాత్ర, అరెస్టు

జనలోకపాల్ బిల్లు కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని ప్రకటించారు. లోకపాల్ పరిధిలో ప్రధాని ఉంటే నష్టమేమిటని ప్రశ్నించారు. కల్మాడీ బ్యారకులో హజారేను ఉంచడం దేశ ప్రజలను అవమానించడమే అన్నారు. గనులను దోపిడి చేస్తున్న వారు, ప్రజాసంపద దోచుకుంటున్న వారు దేశంలో చాలామంది ఉన్నారన్నారు. అవినీతికి పాల్పడిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరన్నారు. అన్నాకు అందరం మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చారు. నిరసనలు చేసే హక్కు అందరికీ ఉందని కానీ అరెస్టు చేయడం మాత్రం సరికాదన్నారు. కేంద్రం మెడలు వంచి బిల్లు తీసుకు రావాలన్నారు. బిల్లు తెచ్చే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. దేశం అవినీతి నుండి బయటపడితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.
అనంతరం చంద్రబాబు మహాత్మా విగ్రహం నుండి పాదయాత్రతో రాంగోపాల్ పేట పోలీసు స్టేషన్ చేరుకున్నారు. అక్కడ అన్నాకు మద్దతుగా జైలు భరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పోలీసు స్టేషన్ ముందు రోడ్డు పైన బాబు బైఠాయించారు. అక్కడ భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. చంద్రబాబుతో సహా దేవేందర్ గౌడ్ వంటి తదితర నేతలను అరెస్టు చేశారు. బాబు అరెస్టుకు నిరసనగా టిడిపి కార్యకర్తలు పోలీసు స్టేషన్ ముందు బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications