వైయస్ జగన్ కోర్టులోకి హెలికాప్టర్ ప్రమాదం?

కేవలం ఆ వ్యాఖ్యలు కొట్టి పారేసే ప్రయత్నాలు మాత్రమే చేశారు. అయితే ప్రమాదంపై కాంగ్రెసు ఎదురుదాడికి దిగేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. హెలికాప్టర్ ప్రమాదం జరిగే నాటికి ఏవియేషన్ కార్పోరేషన్ ఎండిగా వైయస్‌కు దగ్గరి వ్యక్తిగా భావిస్తున్న బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. దీంతో వైయస్ ప్రమాదం విషయంలో ఆయనను టార్గెట్ చేసుకునేందుకు కాంగ్రెసు పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోంది. బ్రహ్మానందరెడ్డి ఎండిగా ఉన్నప్పుడు ప్రమాదం జరిగిన కారణంగా జగన్‌కు చెక్ చెప్పేందుకు ఆయనపై చర్యలకు కాంగ్రెసులోని కొందరు నేతలు డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ప్రధానంగా వైయస్ హెలికాప్టర్ ప్రమాదం చర్చకు వచ్చింది.
ఆ సమయంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. వైయస్ లాంటి మహానేత మృతి విషయంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అయినప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రమాదం సమయంలో ఎండీగా ఉన్న బ్రహ్మానందరెడ్డి తీరును సిబిఐతో పాటు మరో రెండు కమిటీలు తప్పుపట్టాయని అయినప్పటికీ ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మంత్రి రఘువీరా రెడ్డి సైతం వైయస్ వెళ్లే సమయంలో అగస్టా వెస్ట్‌ల్యాండును రెడీ చేయకుండా హెలికాప్టర్ ప్రమాదం జరిగిందన్న నాలుగు గంటలలోనే ఎలా సిద్ధం చేశారని ప్రశ్నించారు. అంతకుముందుగానే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు జారీ చేయగానే అగస్టాకు ఎందుకు మరమ్మతులు చేయలేదని అధికారులను నిలదీశారు. మంత్రులు శైలజానాథ్, మహీధర్ రెడ్డి సైతం అధికారుల తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి వైయస్ హెలికాప్టర్ ప్రమాదాన్ని మళ్లీ జగన్ వర్గం కోర్టులోకి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications