అమ్మాయిపై అత్యాచారం చేసి యాసిడ్ పోసి హత్య!

ఆగస్టు 15న రోహిణి మరో గ్రామంలోని తన స్నేహితురాలితో కలిసి పక్కనున్న పట్టణానికి సినిమా చూసేందుకు వెళ్లింది. మొదటి ఆట చూసిన అనంతరం రాత్రి తొమ్మిది గంటలకు తన ఊరికి బస్సులో తిరుగు ప్రయాణం అయింది. తన స్నేహితురాలిది వేరే గ్రామం కావడంతో వేరు వేరు బస్సులు ఎక్కారు. ఆ తర్వాత రోహిణి ఇంటికి తిరిగి రాలేదు. రోహిణి స్నేహితురాలికి సైతం బుధవారం ఉదయం వరకు రోహిణి ఇంటికి వెళ్లిన విషయం తెలియదని సమాచారం. దీంతో రెండు రోజుల క్రితమే దుండగులు ఆమెపై అత్యాచారం చేసి ఉంటారని అయితే వారు తెలిసిన వారు కావడంతో గుర్తు పడుతుందేమో అన్న ఉద్దేశ్యంతో ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications