• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్'

By Srinivas
|
Google Oneindia TeluguNews
Harish Rao-Etela Rajender
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు బుధవారం విలేకరులతో అన్నారు. ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్ రావు, కె తారక రామారావు కలిశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్‌కు బెదిరింపు కాల్సు వస్తున్న దృష్ట్యా భద్రత పెంచాలని సిఎంను కోరినట్లు హరీష్ రావు చెప్పారు. టి-నేతలకు పలువురికి బెదిరింపు కాల్సు వస్తున్నాయని ఆయన అన్నారు.

మెట్రో రైలు పేరుతో చారిత్రక కట్టడాలను కూల్చి వేస్తే ఊరుకునేది లేదని ఈటెల అన్నారు. కట్టడాలు కూల్చకుండా ప్రత్యామ్నాయం ఆలోచించాలన్నారు. వందల ఎకరాల భూమిని సేకరించి వ్యాపార సముదాయాలకు ఇవ్వడం సరికాదని ఈటెల అన్నారు. మెట్రో వల్ల గన్‌పార్కుకు ప్రమాదం ఏర్పడటమే కాకుండా అసెంబ్లీ భద్రతకు ముప్పు ఉంటుందని నాయిని నరసింహారెడ్డి అన్నారు. అండర్ గ్రౌండ్ మెట్రోను వేయాలని డిమాండ్ చేశారు.

English summary
TRS mla Harish Rao said today that Telangana leaders receiving threat calls. TRS leaders talk with media after CM Kiran Kumar Reddy meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X