వైయస్ జగన్‌కు చిక్కులు: సిబిఐ బృందాల మోహరింపు

మొత్తం 32 సంస్థల్లో సోదాల నిర్వహణకు సిబిఐ అనుమతి పొందినట్లు ఓ చానెల్ చెబుతుండగా మరో టావీ చానెల్ 30 చోట్ల సోదాలకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెబుతోంది. మరో టీవీ చానెల్ 28 సంస్థల పత్రాలను సిబిఐ అధికారులు పరిశీలిస్తున్నారంటూ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. విశాఖపట్నం, చెన్నై, బెంగళూర్‌ల నుంచి సిబిఐ బృందాలను పిలిపించినట్లు తెలుస్తోంది. అయితే, సిబిఐ అధికారులు మాత్రం దర్యాప్తుపై పెదవి విప్పడం లేదు.
జగతి పబ్లికేషన్స్, ఎమ్మార్ సంస్థల్లో సోదాలకు రెండు ప్రత్యేక బృందాలను సిబిఐ ఏర్పాటు చేసింది. జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్, ఇండియా బుల్స్, సందేశ్ ల్యాబ్, క్లాసిక్ రియాలిటీస్, గ్రిల్‌క్రిస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్, యూనిటెక్, అపర్ణ, ఫైనాన్స్ ఇన్‌ఫ్రా, వాల్టెన్ ప్రాపర్టీస్ పత్రాలను సిబిఐ అధికారులు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హెటెరో డ్రగ్స్, హెటెరో ల్యాబ్స్, జూబ్లీ మీడియా, అరవిందో ఫార్మా, ఆల్ఫా విల్లాస్, ఆల్ఫా ఎవెన్యూస్, ఇండియా సిమెంట్, జననీ ఇన్‌ఫ్రా, ఎకె దండమూడి, ఎపిఐఐసి పోలేపల్లి సెజ్, నిమ్మగడ్డ ప్రసాద్, పయనీర్, వ్యాన్‌పిక్, హెటెరో హెల్త్ కేర్ వంటి సంస్థలపై కూడా సిబిఐ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ సంస్థలతో జగన్‌కు గల సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications