వైయస్ జగన్‌పై సిబిఐ దాడులు సబబేనన్న చిరంజీవి

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి రోజున కాంగ్రెసు పార్టీ సభ్యత్వం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. విలీనం ఉబయతారకంగా ఉంటుందని చెప్పారు. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తున్నానని అన్నారు. విలీనం జరగక ముందే పదవులు ఆశించడం సరికాదన్నారు. పదవులు అప్పుడే ఎలా ఆశిస్తామని చెప్పారు. సభ్యత్వం పూర్తయ్యాక తమ పార్టీ వారికి న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా చిరంజీవి శనివారం ఉదయం 11 గంటల సమయంలో కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.












Click it and Unblock the Notifications