హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామా యోచనలో జగన్ వర్గం ఎమ్మెల్యేలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సాఆర్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వైయస్ జగన్ ఆస్తుల పైన, ఆయన కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారి ఇళ్లు, కార్యాలయాల పైన సిబిఐ దాడులు జరుగుతున్న నేపథ్యంలో రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్ వర్గం ఎమ్మెల్యేలు శుక్రవారం వైయస్సార్సీ పార్టీ కార్యాలయంలో అత్యవసరంగా భేటీ ఆయ్యారు. జగన్ ఆస్తులపై సిబిఐ దాడులు తదితర అంశాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా సమావేశం అనంతరం రాజీనామాలపై ఖచ్చితమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

కాంగ్రెసు పార్టీ జగన్‌పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సిబిఐ దాడులు చేస్తుందని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజీనామాలు చేసి జగన్ స్థాపించిన వైయస్సార్సీ పార్టీ తరఫున ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి బుద్ధి చెప్పాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే రాజీనామాలపై తుది నిర్ణయం మాత్రం జగన్‌కే వదిలేయాలని వారు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సమావేశానికి ముందు మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు విలేకరులతో మాట్లాడారు. జగన్‌పై కాంగ్రెసు కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటుందని ఆరోపించారు.

మంత్రి శంకర్ రావు లేఖ రాసినప్పుడే తమకు జగన్‌ను వేధిస్తారనే విషయం అర్థమైందన్నారు. ఇక్కడ జగన్‌పై సిబిఐ విచారణ అన్న కాంగ్రెసు కేంద్రంలో ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్రమంత్రి చిదంబరంపై ఎందుకు సిబిఐ విచారణకు ఆదేశించలేదని అన్నారు. జగన్ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు. ఈ సమావేశానికి పదిమంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ హాజరయ్యారని తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కొర్ల భారతి, ధర్మాన కృష్ణబాబు, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు తదితరులు పాల్గొన్నారు. కాగా కొందరు వ్యక్తిగత కారణాల వల్ల రాలేదని తెలుస్తోంది.

English summary
YSRC party president YS Jaganmohan Reddy camp MLAs may resign for CBI searches on YS Jagan property.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X