అరెస్టు అవకాశం, ఓదార్పునకు వైయస్ జగన్ నో బ్రేక్

YS Jagan
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఓదార్పు యాత్రకు విరామం ఇవ్వదలుచుకోలేదు. తన ఆస్తులపై సిబిఐ అధికారులు దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన ప్రజల మధ్యనే ఉండదలుచుకున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తున్న ఆయన తదుపరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో కొనసాగించే అవకాశాలున్నాయి. అది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సొంత జిల్లా కూడా. వారిద్దరిపై ధ్వజమెత్తే ఉద్దేశంతో ఆయన చిత్తూరు జిల్లాలో ఓదార్పు చేయాలని భావించినట్లు సమాచారం.

కృష్ణా జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర ఈ నెల 26వ తేదీన ముగుస్తుంది. సిబిఐ అరెస్టు చేయవచ్చుననే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ సమయానికి ఆయన ప్రజల మధ్య ఉండదలుచుకున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఆయన చిత్తూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చేయనున్నారు. ప్రజల మధ్యలో ఉన్నప్పుడు సిబిఐ ఇప్పటి వరకు ఏ నాయకుడిని కూడా అరెస్టు చేయలేదు. అయితే, జగన్ విషయంలో సిబిఐ ఆ చర్యకు దిగేలా చూడాలని వైయస్సార్ కాంగ్రెసు వర్గాలు అనుకుంటున్నాయి. దానివల్ల ప్రజల సానుభూతిని పొందవచ్చుననేది వ్యూహంగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+