జగన్ పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి అరెస్టు

వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తదితరులను లోనికి అనుమతించిన పోలీసులు చెవిరెడ్డి భాస్కర రెడ్డిని మాత్రం అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన చెవిరెడ్డి ఆందోళనకు దిగారు. వైయస్సార్ మంత్రివర్గ సభ్యులపై కూడా సిబిఐ విచారణ జరిపించాలని కోరడానికి జగన్ వర్గం నాయకులు ముఖ్యమంత్రిని కలుసుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications