టిడిపి అధినేత చంద్రబాబుపై కెసిఆర్ టి-ఛానల్ ధ్వజం

అవినీతిపై అన్నాహజారే చేస్తున్న ఉద్యమాన్ని తీసుకొని రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో టిడిపికి పాత వైభవం తీసుకు రావాలని చంద్రబాబు కలలు కంటున్నారని ఆరోపించింది. అయితే చంద్రబాబును తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పింది. అవినీతిపై ఉద్యమం ద్వారా తెలంగాణలో తిరిగి పాగా వేయాలన్న చంద్రబాబు కుయుక్తులను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నది. అంతేకాకుండా తెలంగాణ భూములను అప్పనంగా కంపెనీలకు కట్టబెట్టడం చంద్రబాబు హాయం నుండే ప్రారంభమైనదని ఆరోపణలు చేసింది.












Click it and Unblock the Notifications