తెలంగాణ మంత్రులపై చార్జిషీట్ వేయాలి: నాగం

విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేసిన తెలంగాణ మంత్రులు ఇప్పుడు విద్యార్థి నాయకులు అరెస్టయినా మాట్లాడడం లేదని ఆయన విమర్శించారు. స్పీకర్ అన్నా, శాసనసభ అన్నా తమకు గౌరవం ఉందని, విద్యార్థుల బలిదానాలతో ఒత్తిడికి లోనయ్యామని ఆయన అన్నారు. రాజీనామాలు చేసే హక్కు తమకు ఉందని ఆయన అన్నారు. తాము రాజీనామాలు చేసినా స్పీకర్ కనీసం మాట్లాడకుండా రాజీనామాలను ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications