సిబిఐ విచారణకు భయపడడం లేదు: బొత్స

వైయస్సార్ మంత్రివర్గంలో ఉన్నప్పుడు తానేమీ తప్పు చేయలేదని, సిబిఐ విచారణకు భయపడడం లేదని, తప్పు చేసినవారు బాధ్యత వహించాల్సిందేనని ఆయన అన్నారు. సిబిఐ విచారణకు వెనకడుగు వేసేది లేదని ఆయన అన్నారు. మరో సమస్య లేనట్లు జగన్ వర్గానికి చెందిన నాయకులు దీనిపైనే మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నాడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్సార్ ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాస రెడ్డి ముందు తనపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ లేఖ రాయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications