జగనే మొదటి ముద్దాయి: బయటికొచ్చిన ఎఫ్ఐఆర్

సండూరు పవర్ ప్రాజెక్టు, కార్మెల్ ఏషియా, భారతి సిమెంట్స్, ఇందిరా టెలివిజన్, జగతి పబ్లికేషన్స్, బ్రాహ్మిణి ఇన్‌ఫోటెక్, పెన్నా గ్రూప్, పయోనీర్, రాంకీ, దాల్మియా సిమెంట్, క్లిఫ్టన్ డెంటల్ టెక్నాలజీ, గ్రోమోర్ ఫండ్, సూపర్ ఫైనాన్సర్, శివలక్ష్మి, క్రాంతి ఎలక్ట్రో సిస్టమ్స్, రావు రియల్ ఎస్టేట్స్, జయలక్ష్మి, శతాబ్ది ఇన్ ఫ్రా, హారతి లైసెన్స్, బై ఇన్ ల్యాండ్ ఫైనాన్స్, డెల్టా ఎంటర్ ప్రైజెస్, ఇస్పాత్ స్టీల్స్, శివాజీ కెమికల్స్, సుగమ్ కమర్షిటల్ డెవలప్‌మెంట్, ఎం శ్రీనివాస్ రెడ్డి, జి.శ్రీనివాస్ రెడ్డి తదితర పెట్టుబడులు పెట్టిన, జగన్ కంపెనీల పేర్లను ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారిలో దండమూడి ఎకె, శ్రీనివాసనాయుడు, భాష తదితరుల పేర్లు ఉన్నాయి.
ఎమ్మార్ కేసులో ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 47 పేజీల ఎఫ్ఐఆర్ సిబిఐ అధికారులు సమర్పించారు. అందులో మొదటి ముద్దాయిగా బిపి ఆచార్య, రెండో ముద్దాయిగా పార్థసారథిని పేర్కొన్నారు. ఎమ్మార్ కేసులో అన్న నోన్ ఆదర్సులో పలువురు ప్రభుత్వ అధికారులను చేర్చే అవకాశం ఉంది. కాగా సిబిఐ చాలా కంపెనీలపై, వ్యక్తులపై సెర్చ్ వారెట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications