వైయస్ జగన్‌కు వైయస్ కవర్, కాంగ్రెసుపై నిందలు

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెసు పార్టీ పథకం ప్రకారం కుట్ర పన్నుతోందని గురువారంనాటి సిబిఐ పత్రికా ప్రకటనే సాక్షిగా స్పష్టమైందని సాక్షి వ్యాఖ్యానించింది. వైయస్ కుటుంబాన్ని కూడా అప్రతిష్టపాలు చేసేందుకు వ్యూహం ప్రకారమే ఎమ్మెల్యే శంకరరావును ఆయుధంగా పార్టీ వాడుకున్న వైనాన్ని తాజా పరిణామాలు మరోసారి ధ్రువీకరిస్తున్నాయని విమర్శించింది. వైయస్ హయాంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటికీ మంత్రివర్గం మొత్తానిదీ సమష్టి బాధ్యతన్న వాస్తవాన్ని పక్కదారి పట్టించేందుకు కొంత కాలంగా రకరకాలుగా ప్రయత్నిస్తున్న కాంగ్రెసు, తాజాగా సిబిఐని కూడా ఆయుధంగా వాడుకుంటోందని వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications