సోనియా డైరెక్షన్‌తోనే సిబిఐ దాడులు: అంబటి రాంబాబు

వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసిన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిపై శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అందరం రాజీనామా చేసి, కాంగ్రెసువారు వైయస్ ఫోటో లేకుండా గెలవాలని ఆమె సవాల్ చేశారు. వైయస్సార్ ఫొటో పెట్టుకుని గెలిచి ఇప్పుడు సవాల్ చేస్తున్నారని ఆమె శనివారం హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ రాజీనామాల గురించి మాట్లాడే నైతిక హక్కు డిఎల్ రవీంద్రా రెడ్డికి లేదని ఆమె అన్నారు. ముందు తన నియోజకవర్గంలో డిఎల్ రవీంద్రా రెడ్డి డిపాజిట్ దక్కించుకోవాలని ఆమె అన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే సిబిఐ దర్యాప్తులో తమ ప్రమేయం లేదని కాంగ్రెసు చెప్పుకుంటోందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications