వైయస్సారే మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు: సోమిరెడ్డి

Somireddy Chandramohan Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా దేశంలో పోరాటం జరుగుతుంటే జగన్‌కు మద్దతుగా బస్సు యాత్ర చేస్తారా అని ఆయన వారిని అడిగారు. తెలుగుదేశం పార్టీని వైయస్ రాజశేఖర రెడ్డే ఏమీ చేయలేకపోయారని, జగన్ ఏం చేస్తారని ఆయన అన్నారు. జగన్ ఆస్తులపై జరుగుతున్న సిబిఐ దర్యాప్తు మీద తమకు పూర్తి నమ్మకం ఉందని ఆయన అన్నారు.

దేశ చరిత్రలో ఇంత పెద్ద అవినీతి కుంభకోణాన్ని ఎప్పుడూ చూడలేదని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. జగన్‌ అవినీతి ఆస్తులను లెక్క వేయడానికి సీబీఐకి ఉన్న సిబ్బంది సైతం సరిపోవడం లేదన్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు తెదేపా, కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యాయంటూ జగన్‌ ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌ను పచ్చి అవకాశవాదిగా అభివర్ణించారు. పరిటాల హత్య కేసులో జగన్‌ ఇంటికొచ్చి సీబీఐ విచారణ జరిపితే... ఆనాడు ఆ సంస్థ మంచిగా కనిపించిందా అని జగన్‌ను సోమిరెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు కోర్టు ఆధ్వర్యంలో సీబీఐ అక్రమ ఆస్తులు వెలుగుతీస్తుంటే దాన్ని కుట్రగా అభివర్ణిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మార్‌ కుంభకోణంలో చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సీబీఐ విచారణలో తేలుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

హైకోర్టు ఆదేశాలమేరకే జగన్‌పై సీబీఐ విచారణ జరుపుతోంది తప్ప ప్రభుత్వాల చొరవ వల్ల కాదని తెలుగుదేశం పార్టీవిప్‌ ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సీబీఐ సోదాలతో శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందనే కంగారుతోనే జగన్‌, అతని అనుచరులు తెదేపాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్‌ అధికారంలో ఉన్నప్పుడూ, ఆ తర్వాతా ఆయన అక్రమాలపై తమ పార్టీ పోరాటం చేసిందని, ఇప్పుడూ కొనసాగిస్తోందనే విషయం జగన్‌ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్‌ వేల కోట్లరూపాయలు సంపాదించేందుకు వైఎస్‌ సహకరించారని ఆయన ఆరోపించారు. తన ఆస్తులపై సిటింగ్‌ జడ్జ్‌తో విచారణకు ఆదేశించాలని శాసనసభలో చంద్రబాబు సవాల్‌ చేసినా అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి స్పందించలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+