వైయస్ జగన్ వర్గం రాజీనామాల వెనుక?

K Chandrasekhar Rao and YS Jaganmohan Reddy
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం రాజీనామాల ప్రకటనతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి ఒక్కసారిగా వేడెక్కాయి. నాలుగు రోజులుగా జగన్ ఆస్తులపై సిబిఐ దాడుల జరుగుతుండటంతో అందరి దృష్టి అటువైపు మరలిన నేపథ్యంలో జగన్ వర్గం శాసనసభ్యుల రాజీనామాతో ఒక్కసారి అందరి దృష్టి రాజకీయ సంక్షోభం, ఎన్నికల వైపు మరలాయి. జగన్ వర్గం ఎమ్మెల్యేల రాజీనామాలు అనంతర పరిణామాలను అధికార కాంగ్రెసు పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి తదితర ప్రధాన పార్టీలు నిషితంగా పరిశీలిస్తున్నాయి. జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఏం ఆశించి రాజీనామా చేస్తున్నారు? వారి వెనుక ఎవరు ఉన్నారు? అనే ప్రశ్నలు ప్రస్తుతం పలువురిలో తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెసు, టిడిపిలో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నట్లుగా కనిపిస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జగన్ వర్గం ఎమ్మెల్యేల రాజీనామా వెనుక టిఆర్ఎస్ హస్తం ఉందా? లేదా? అనే కోణంలో టిడిపి వంటి పార్టీలు యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా ఉండటం, సీమాంధ్ర ప్రాంతంలో సిబిఐ దాడుల కారణంగా జగన్‌పై సానుభూతి ఏర్పడుతుందని ఇరు ప్రాంతాలలో లబ్ధి పొందవచ్చునన్న భావనతో వైయస్సాఆర్ కాంగ్రెసు, టిఆర్ఎస్ పార్టీలు ముందుకు వెళుతున్నాయా? అని కోణంలో ఆలోచిస్తున్నారు. గతంలోనూ జగన్‌కు టిఆర్ఎస్ మద్దతు పలికినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ వైపు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. టిఆర్ఎస్ హస్తంపై మాత్రమే అనుమానాలు వ్యక్తం చేయకుండా సిబిఐ దర్యాఫ్తు కోణంలోనూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అవినీతిపై అన్నాహజారే తీవ్ర పోరాటం చేస్తుండటం, ఆయనకు దేశ ప్రజల నుండి భారీగా మద్దతు లభించడం మనం చూస్తున్నదే. టిడిపి అధినేత చంద్రబాబు సైతం రాష్ట్రంలో హజారేకు మద్దతుగా భారీగా ర్యాలీలు, కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి దూసుకు వెళుతున్నారు. ఇలాంటి సమయంలో జగన్ ఆస్తులపై సిబిఐ దాడులు జరుగుతున్నాయి. ఇవి ప్రజల్లోకి ఇప్పటికా బాగా వెళ్లాయి. ఇవి ప్రజల్లోకి మరింత వెళ్లి జగన్ ఇమేజ్ దెబ్బతీయకుండా ఉండడానికే అందరి దృష్టి మరల్చడానికే రాజీనామాల అస్త్రం ప్రయోగించవచ్చనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణలో ఉద్యమం తీవ్రత వల్ల, సీమాంధ్రలో జగన్ ప్రభావం వల్ల ఇటు అధికార కాంగ్రెసు గాని, అటు ప్రతిపక్ష తెలుగుదేశం గాని సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినప్పటికీ ప్రభుత్వానికి ఢోకా లేదని తెలిసి కేవలం ప్రజల దృష్టి మరల్చడానికే ప్రయత్నాలు చేసి ఉంటారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+