ఇక రాజీనామాలే: వైయస్ జగన్ ఎమ్మెల్యేల నిర్ణయం

ఈ భేటీలో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. భేటీకి హాజరైన వారితో పాటు మరికొందరు సైతం రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరికొందరు నేతలు తమ తమ కార్యక్రమాల వల్ల భేటీకి హాజరు కానప్పటికీ రాజీనామాలు చేయడానికి మాత్రం కలిసి వస్తామని చెప్పారని వైయస్సార్సీ పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా వీరంతా ఆదివారం సాయంత్రం లేదా సోమవారం తమ రాజీనామాలను స్పీకర్‌కు ఇవ్వనున్నారు. భేటీలో చాలామంది రాజీనామాలకు మొగ్గుచూపగా, కొందరు రాజీనామాలు వద్దని సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే ఆఖరుగా రాజీనామాలకే మొగ్గు చూపారు. రాజీనామా చేసే వారి సంఖ్య 30 వరకు ఉండవచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications