మొదటి రాజీనామా నాదే: జగన్ వర్గం బాబురావు

YSR Congress
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి అవమానం జరిగితే అందరి కంటే ముందు తానే రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని పాయకరావు శాసనసభ్యుడు గొల్ల బాబురావు ఆదివారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు పార్టీ వేధింపులకు, దివంగత వైయస్‌ను డీ ఇమేజ్ చేయడానికి కాంగ్రెసు కుట్ర పన్నుతుందన్న అభిప్రాయంతో జగన్ వర్గం నేతలు పలువురు ఆదివారం వైయస్సార్ పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీకి వచ్చిన బాబురావు మీడియాతో మాట్లాడారు.

వ్యక్తిగతంగా తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని అయితే ఎంతమంది రాజీనామాకు సిద్ధపడతారో చూద్దామని ఆయన అభిప్రాయపడ్డారు. సమావేశానికి తనను ఎవరూ పిలవలేదని తానే సొంతంగా వచ్చానని చెప్పారు. వైఎస్‌కు అవమానం జరిగితే ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కచ్ఛితంగా దీనిపై నిరసన తెలుపుతామని ఆయన అన్నారు. నిరసన తెలపాల్సిన బాధ్యత అందరిపై
ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+