అనంత పద్మనాభస్వామి ఆరోగదిపై హైకోర్టుకు

ఆరో నేలమాళిగను తెరవకూడదా తెరవాలా అన్న అంశంపై ఇటీవల దేవాలయ సంబంధీకులు దైవప్రశ్నం నిర్వహించారు. ఇది నాలుగు రోజుల పాటు నిర్వహించారు. దైవప్రశ్నంలో ఆరో నేలమాళిగను తెరవకూడదని, తెరిస్తే అరిష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. సంపద బహిర్గతం కావడంపై దేవుడు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. నాగబంధం ఉన్న ఆరో గది ఎంతో చైతన్యపూరితమైనదని అది తెరిస్తే అరిష్టాలు జరుగుతుందని దైవప్రశ్నంలో తేలింది. అయితే సుప్రీం కోర్టు బృందం మాత్రం తెరవడానికే నిర్ణయించింది. దీంతో దేవాలయ సంబంధీకులు హైకోర్టును ఆశ్రయించారు. ఆరోగది తెరిస్తే నష్టం ఉంటుందని చెబుతూ వారు హైకోర్టును ఆశ్రయించారు. మరి సుప్రీం కోర్టు బృందం నిర్ణయంపై హైకోర్టు ఏం తీర్పు చెప్పనుందో చూడాలి.












Click it and Unblock the Notifications