తెలంగాణ ఉద్యమంపై జగన్ వర్గం రాజీనామా ప్రభావం!

ప్రభుత్వం సంక్షోభం దృష్ట్యా వారి రాజీనామాలు స్పీకరు ఎంత వరకు ఆమోదిస్తారనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. తెలంగాణ కోసం రాజీనామా చేసిన 101 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రేజర్ పేరిట తిరస్కరించారు. అలాగే జగన్ వర్గం ఎమ్మెల్యేల రాజీనామాలు తిరస్కరిస్తే ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. ఒకవేళ వారి రాజీనామాలు ఆమోదించినా పిఆర్పీ, ఎంఐఎం ఆదుకుంటుంది కాబట్టి ప్రభుత్వం పడిపోయే ఆస్కారం లేదు. కానీ జగన్ వర్గం ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదిస్తే తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులూ తమ రాజీనామాలకు పట్టుబట్టే అవకాశం ఉంది.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా ఆమోదింప చేసుకోవడానికి స్పీకర్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం రాజీనామాలు చేసి ఆమోదింప చేసుకోవాడనికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ జగన్ వర్గం ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించిన పక్షంలో వీరంతా స్పీకర్‌పై ఒత్తిడి తేవడం ఖాయం. అలాంటి పరిస్థితే వస్తే తెలంగాణ ప్రాంతంలో టిడిపి, కాంగ్రెసు ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలోని సెంటిమెంటు దృష్ట్యా వారు రాజీనామా చేసి ఆమోదం కోసం పట్టుబట్టే స్థితి వస్తే ప్రభుత్వం ఇక్కట్లలో పడ్డట్టేనని పలువురు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications