నేనో ఉదాహరణ: జగన్‌కు కిరణ్ పరోక్ష చురకలు

Kiran Kumar Reddy
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరోక్ష చురకలు వేశారు. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు కాంగ్రెసులో చేరిన సందర్భంగా ఆయన గాంధీ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వెళ్లి సొంత కుంపటి పెట్టుకున్న వారెవరూ ఇప్పటి వరకు బాగుపడలేదని అన్నారు. కాంగ్రెసును బలహీనపర్చే శక్తి ఎవరికీ లేదన్నారు. పార్టీ తనంత తాను ఓడించుకుంటే తప్ప బలహీనపర్చే శక్తి ఎవరికీ లేదన్నారు.

తాను మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేశానని అయితే అది దక్కక పోయినప్పటికీ నేరుగా ముఖ్యమంత్రినే కాగలిగానని అన్నారు. ముఖ్యమంత్రి కోసం మాత్రం తాను ఎవరినీ అడగలేదన్నారు. చిత్తశుద్ధి, నిజాయితీతో పని చేస్తే అధికారం దానంతట అదే వస్తుందని ఆయన అన్నారు. అందుకు తానే మంచి ఉదాహరణ అని చెప్పారు. అధికారం చుట్టూ తిరిగితే అధికారం దక్కదన్నారు. కాంగ్రెసులో బేధాభిప్రాయాలు సహజమే అన్నారు. చిరంజీవి ప్రజారాజ్యాన్ని భేషరతుగా కాంగ్రెసులో విలీనం చేయడం సంతోషకరమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+