జగన్ వర్గ రాజీనామాలు, పావులు కదుపుతున్న కెసిఆర్

తాజాగా, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ కూడా కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధపడ్డారు. ఇప్పటి రాజకీయ సంక్షోభం తెలంగాణ సాధనకు కలిసి వస్తుందని, తెలంగాణ కోసం తెలంగాణ ప్రాంత శానససభ్యులు రాజీనామాలు చేయాలని ఆయన అన్నారు. రాజీనామాలు చేస్తేనే సకల జనుల సమ్మెకు మద్దతు తెలిపే హక్కు ఉంటుందని ఆయన అన్నారు. జగన్‌తో కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెసు వైపు నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. దీన్ని బట్టి కెసిఆర్ తనకు అనుకూలంగా పరిస్థితిని మలుచుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఈ రకంగా ఆయన మళ్లీ ఎన్నికలను కూడా ఆహ్వానిస్తున్నారు.












Click it and Unblock the Notifications