జగన్ కొండా సురేఖతో కెవిపి పేరు చెప్పించాడు: లగడపాటి

Lagadapati Rajagopal
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకున్న అవకతవక నిర్ణయాల వెనక రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు పాత్ర ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తన వర్గానికి చెందిన శాసనసభ్యురాలు కొండా సురేఖతో చెప్పించారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. వైయస్ జగన్‌పై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. ఎఫ్ఐఆర్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి పేరు ఉందని జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు రాజీనామాలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. ఎఫ్ఐఆర్ అంటే ఏమిటో జగన్ తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఎఫ్ఐఆర్‌లో వైయస్సార్ పేరును ఎక్కడా నిందితుడిగా పేర్కొనలేదని ఆయన స్పష్టం చేశారు.

వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు హైకోర్టునే సవాల్ చేస్తున్నారని, ఆ రకంగా కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారని, దీనివల్ల తీవ్రమైన పరిణామాలుంటాయని ఆయన అన్నారు. సిబిఐ దర్యాప్తు వెనక కాంగ్రెసు హస్తం లేదని ఆయన మరోసారి స్పష్టంచేశారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని వైయస్ జగన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో ఎక్కడా చెప్పుకోలేదని, కుట్రలో భాగంగానే సిబిఐ దర్యాప్తు జరుగుతోందని మాత్రమే అన్నారని ఆయన అన్నారు. అభియోగాల విషయంలో కెవిపి పేరు ప్రస్తావించిన జగన్ వర్గం పథకాల విషయంలో కెవిపి, కాంగ్రెసు పాత్ర ఉందని ఎందుకు చెప్పడం లేదని ఆయన అడిగారు. తాను నిర్దోషినని నిరూపించుకోవాల్సిన బాధ్యత జగన్‌పై ఉందని ఆయన అన్నారు.

పప్పూ యాదవ్ జైల్లో ఉండి భారీ మెజారిటీతో రెండు సార్లు గెలిచాడని, తర్వాత ఓడిపోయాడని, పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదని, బండారం ప్రజలకు అర్థమవుతుందని ఆయన అన్నారు. నీతికి, అవినీతికి మధ్య పోరాటం జరుగుతోందని, ఈ స్థితిలో జగన్ తీరు బాగా లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+