తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారా?

మంత్రి కె. జానా రెడ్డి తిరిగి వచ్చిన తర్వాత రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి సమావేశానంతరం చెప్పారు. ఆయన మాటలను బట్టి తెలంగాణ శాసనసభ్యులు రాజీనామాలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెసును కాపాడుకుంటూనే తెలంగాణ సాధిస్తామని ఆయన అన్నారు. రాజీనామాలపై తెలంగాణ రాజకీయ జెఎసి డెడ్‌లైన్‌ను పట్టించుకోబోమని ఆయన చెప్పారు. జగన్ వర్గంతో తమకు సంబంధం లేదని కూడా ఆయన స్పష్టం చేసారు. దీన్నిబట్టి వారు రాజీనామాలు చేసే అవకాశాలు లేవని అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications