జగన్ కట్టడి కోసం సిఎం సమావేశం: హాజరైన వివేకా

తన అన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసు పార్టీలోనే ఉండాలని కోరుకునే వారని తాను సైతం తన అన్న దారిలోనే నడుస్తానని పలుమార్లు చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెసు తరఫున తన వదిన వైయస్ విజయమ్మపై పోటీ చేసి ఓడిపోయారు. జగన్ ఆస్తులపై సిబిఐ దాడులు ప్రారంభం అయ్యే వరకు వివేకా కాంగ్రెసు వెంటనే ఉన్నారు. అయితే సిబిఐ దాడులు ప్రారంభమయ్యాక మాత్రం ఆయన జగన్‌కు అండగా నిలిచారు. జగన్‌పై సిబిఐ దాడులు సరికాదని, మా ఇంటా వంటా అవినీతి, అక్రమాలు లేవని ప్రకటించి జగన్‌కు మద్దతు పలికారు. అయితే మంగళవారం మళ్లీ జగన్‌ను కట్టడి చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనడం విశేషం.












Click it and Unblock the Notifications