బాబు ట్రాప్‌లో కాంగ్రెస్: వైయస్ జగన్‌కు జీవన్ రెడ్డి అండ

చంద్రబాబు తన అవినీతిపై బహిరంగ విచారణకు సిద్ధమని చెబుతున్నారు. కానీ సిబిఐ దర్యాఫ్తుకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. వైయస్‌ను, జగన్‌ను విమర్శించడం ద్వారా లబ్ధి పొందేది చంద్రబాబే అన్నారు. వైయస్‌పై బురద జల్లిదే అది కాంగ్రెసు పైనే పడుతుందన్నారు. వైయస్ తప్పు చేసినట్లుగా తాను భావించడం లేదన్నారు. వైయస్‌పై అవినీతిపై హైకోర్టులో కేసు వేసినప్పుడు కాంగ్రెసు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదన్నారు. వైయస్‌పై వస్తున్న అవినీతి ఆరోపణలను ప్రభుత్వం అడ్డుకోవాలన్నారు.
జగన్ అవినీతి తేలితే మొదటి ముద్దాయి కాంగ్రెసే అన్నారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం చంద్రబాబు ట్రాప్‌లో పడితే భవిష్యత్తులో కాంగ్రెసుకే నష్టం అన్నారు. తాను కాంగ్రెసు వాదినని పార్టీని బతికించుకోవడానికే తాను ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నానని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసు ఎప్పుడో తుడిచి పెట్టుకు పోయిందన్నారు.












Click it and Unblock the Notifications