జగన్ వైపు వెళ్లను, తెలంగాణ కోసమే ఉద్యమిస్తా: కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు తాను వెళుతున్నట్లు కొన్ని ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని అది అవాస్తవమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం అన్నారు. సీమాంధ్ర ఛానళ్ల విష ప్రచారాన్ని తాను ఖండిస్తున్నానని అన్నారు. తాను బతికున్నంత కాలం తెలంగాణవాదిగానే ఉంటానన్నారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. వందలాది మంది విద్యార్థులు, యువకులు చనిపోతుంటే మంత్రులు సమావేశాలకు ఎలా హాజరవుతున్నారని ఆయన ప్రశ్నించారు.

పదవులు లేకుండా తెలంగాణ నేతలు ఒక్క క్షణం ఉండరన్న సీమాంధ్ర నేతల మాటలను నిజం చేస్తున్నట్టుగా తెలంగాణ మంత్రుల తీరు ఉందని విమర్శించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సెప్టెంబరులోగా నిర్ణయం తీసుకోవాలని లేదంటే లక్ష మంది ప్రజలతో దీక్షకు దిగుతామని హెచ్చరించారు. తెలంగాణపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+