టిటిడి చైర్మన్‌గా చిరంజీవి బావమరిది అల్లు అరవింద్?

ఆ విషయంపై చిరంజీవి ఇప్పటికే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెవిన కూడా ఆ విషయం వేసినట్లు చెబుతున్నారు. రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిరంజీవి ఫోన్ చేయించినట్లు సమాచారం. అయితే, అల్లు అరవింద్‌ను టిటిడి చైర్మన్‌గా నియమించడం ముఖ్యమంత్రికి ఇష్టం లేదని అంటున్నారు. దీంతో టిటిడి చైర్మన్ నియామకాన్ని సోనియా స్వదేశానికి తిరిగి వచ్చేవరకు పెండింగులో పెట్టాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. కాగా, నాగబాబును ఏదో కార్పొరేషన్ చైర్మన్‌గా వేయించేందుకు కూడా చిరంజీవి పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications