వేయి కోట్లు ఇస్తే నా ఆస్తులు రాసిస్తా: చంద్రబాబు

అవినీతి డబ్బులతో రాజకీయాలు చేస్తున్నారని, అవినీతిపై ప్రజల్లో చైతన్యం పెరిగితే అటువంటివారి ఆటలు సాగవని ఆయన అన్నారు. డబ్బులిచ్చి శాసనసభ్యులను కొంటున్నారని, అటువంటి వారిని ఎన్నికల్లో ఓడించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలోని గనులు దోచేశారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత పెరిగిపోయిందని ఆయన అన్నారు. ప్రధాని మన్మోహన్ లాంటివారు పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. లోక్‌పాల్ బిల్లుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. ప్రతిపైసాకు ప్రభుత్వం లెక్కలు చూపాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications