గాలి ఒత్తిడితో వైయస్ జగన్‌కు అరుణ్ జైట్లీ మద్దతు

Arun Jaitley-Gali Janardhan Reddy
న్యూఢిల్లీ: వైయస్ జగన్‌కు మద్దతిచ్చే విధంగా బిజెపి నేత అరుణ్ జైట్లీ బుధవారం రాజ్యసభలో మాట్లాడడం పలువురిని ఆశ్చర్యపరిచింది. మరణించిన వ్యక్తిని (వైయస్సార్‌ను) సిబిఐ ఎఫ్ఐఆర్‌లో చేర్చడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. అవినీతిపై రాజ్యసభలో జరిగిన స్వల్ప వ్యవధి చర్చలో పాల్గొన్న జైట్లీ సీబీఐ అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతోందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో తాజ్ కారిడార్ కేసులో మాయావతిని ఇరికించిన సీబీఐ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక చనిపోయిన ముఖ్యమంత్రి పేరును ఎఫ్ఐఆర్‌లో పేర్కొనడం శోచనీయమని జైట్లీ విమర్శించారు.

దీన్నిబట్టి బిజెపి నాయకత్వం జగన్‌కు మద్దతుగా నిలవడానికి సిద్ధమైనట్లు అర్థమవుతోంది. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన కర్ణాటక బిజెపి నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి ఒత్తిడి, జగన్ విజ్ఞప్తులు ఇందుకు కారణమని తెలుస్తోంది. బిజెపితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా లేనని జగన్ పలుమార్లు చెప్పారు. అయినా బిజెపి ఆయనకు మద్దతు ఇవ్వడానికే సిద్ధపడినట్లు తెలుస్తోంది.

ఒక జాతీయ పార్టీ అండ లేకుంటే మనుగడ కష్టమని భావించిన జగన్ ఈ కష్ట కాలంలో తనను ఆదుకోవాల్సిందిగా బీజేపీ నేతలను కోరినట్లు వార్తలు వచ్చాయి. తనను ప్రస్తుత ఇబ్బందుల ఉంచి గట్టెక్కిస్తే భవిష్యత్తులో బీజేపీకి తన పూర్తి మద్దతు ఉంటుందని ఆ పార్టీ నేతలకు జగన్ హామీ ఇచ్చినట్లు, దానికి బీజేపీ అగ్ర నేతలు అంగీకరించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే జగన్‌కూ, బీజేపీ నేతలకూ మధ్య జాతీయ స్థాయిలో సాన్నిహిత్యం పెరుగుతున్నట్లు అర్థమవుతోంది.

జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంలో లోక్‌సభలో బీజేపీ నేత సుష్మాస్వరాజ్‌తో పాటు ఆ పార్టీ సభ్యులు బల్లలు చరచి పెద్దఎత్తున హర్షాతిరేకాలు ప్రదర్శించడంతోనే బీజేపీ వైఖరి తేటతెల్లమైంది. బీజేపీ రాజ్యసభ సభ్యుడైన రామ్ జెఠ్మలానీ జగన్ తరఫున సుప్రీంకోర్టులో వాదించడానికి ముందుకు రావడం కూడా ఆ విషయాలను తెలియజేస్తున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+