రాజీనామాలపై తగ్గేది లేదు: జగన్ ఎమ్మెల్యే మేకపాటి

Mekapati Chandrasekhar Reddy
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు రాజీనామాలకు కట్టుబడి ఉన్నారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి గురువారం అన్నారు. రాజీనామాలపై ఎవరూ వెనక్కి తగ్గేది లేదన్నారు. రాజీనామాలు చేసిన వాళ్లమంతా నూటికి నూరునూరు శాతం కట్టుబడి ఉన్నామని చెప్పారు. తమ రాజీనామాలు ఖచ్చితంగా ఆమోదించుకుంటామని చెప్పారు. కాంగ్రెసు పార్టీ మాటలు రాష్ట్రంలోని ప్రజలు నమ్మడం లేదన్నారు. జగన్‌కు వస్తున్న ప్రజాధరణ తట్టుకోలేకే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయన్నారు.

ఆయన శక్తిని ఎవరూ ఆపలేరన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెసు, టిడిపిలు రాష్ట్రంలో తుడిచి పెట్టుకు పోవడం ఖాయమన్నరు. వారిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వారి కుట్రలను ప్రజలకు తెలియజేయడానికి త్వరలో బస్సుయాత్ర చేపడతామని చెప్పారు. కాంగ్రెసు బాబు ఉచ్చులో పడిపోయిందన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెసు నేతలు ఎవరూ స్పందించడం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ప్రభుత్వం అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+