బిజెపికి తాజా చిక్కులు, గాలి బ్రదర్స్ ఎమ్మెల్యేల క్యాంప్?

మైనింగ్ అక్రమాల్లో లోకాయుక్త గాలి బ్రదర్స్‌ను తప్పు పట్టింది. ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డికి, గాలి కరుణాకర్ రెడ్డికి, వారి అనుచరుడు శ్రీరాములుకు మంత్రి పదవులు దక్కలేదు. గాలి వర్గంలోని ఎవరికీ అవకాశం లభించలేదు. పైగా, గాలి జనార్దన్ రెడ్డికి చెందిన సండూరు వ్యవహారంపై జారీ చేసిన వారంట్లను అమలు చేయకపోవడంపై హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి వర్గానికి చెందిన శాసనసభ్యుల మంతనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నెల 31వ తేదీన జరిగే మంత్రివర్గ విస్తరణలో తమ వర్గానికి చెందినవారికి మంత్రి పదవులు దక్కకపోతే తిరుగుబాటు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.
లోకాయుక్త నివేదిక తప్పు పట్టినందున గాలి జనార్దన్ రెడ్డి సోదరులకు మంత్రి పదవులు దక్కే అవకాశాలు లేవు. అయితే, ఆయన వర్గానికి చెందిన నలుగురికి మంత్రి పదవులు కావాలని ఆయన పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. బళ్లారిలో గనుల తవ్వకాలను సుప్రీంకోర్టు నిషేధించిన నేపథ్యంలో తమవారు మంత్రివర్గంలో ఉండడం అవసరమని గాలి జనార్దన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications