మా అమ్మ బాగుంది, త్వరలో వచ్చేస్తారు: ప్రియాంక

పార్లమెంటు భవనం నుంచి వేగంగా నడిచిపోతున్న ఆమెను కొద్ది జర్నలిస్టులు పట్టుకోగలిగారు. వారు ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించారు. సోనియా ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు. ఆమె బాగుందని, త్వరలోనే దేశానికి తిరిగి వస్తారని ప్రియాంక సమాధానమిచ్చారు. హజారే దీక్షపై, అవినీతి వ్యతిరేక ఆందోళనలపై ఏమంటారని అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా నవ్వుతూ వెళ్లిపోయారు. రాహుల్ గాంధీ ప్రసంగం ఎలా ఉందని అడిగితే ఆయన అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నట్లు జవాబిచ్చారు.












Click it and Unblock the Notifications