జగన్‌కు బిజెపి నేత సుష్మా స్వరాజ్ మద్దతు?

Sushma Swaraj
వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ మద్దతు వెనుక లోకసభ ప్రతిపక్ష సభ్యురాలు సుష్మా స్వరాజ్ అండ ఉన్నట్లుగానే కనిపిస్తోంది. ఇటీవల జగన్ ఎంపీగా బాధ్యతలు చేపట్టిన సమయంలో బిజెపి నేతలు బల్లలు చరిచి ఆనందం వ్యక్తం చేయడం, పార్లమెంటులో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరును ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించడం వెనుక కుట్ర ఉన్నదని అరుణ్ జైట్లీ అనుమానాలు వ్యక్తం చేయడం, ఇక జగన్‌ను అవినీతి కేసు నుండి బయట పడేయడానికి ఆ పార్టీకి చెందిన ఉద్దండ న్యాయవాది రాం జెఠ్మలానీ ఆయన తరఫున వాదిస్తున్న విషయం తెలిసిందే.

పార్లమెంటులో ఓ వైపు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బిజెపి మకిలి అంటించుకున్న జగన్‌కు అదే పార్లమెంటులో మద్దతు పలకడమేమిటని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ సహా పలు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. విపక్షాలు మాటలు అటుంచితే జగన్‌కు మద్దతు వెనుక బిజెపిలోనే ఏకాభిప్రాయం లేనట్లుగా సమాచారం. ఆ పార్టీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ జగన్‌కు మద్దతు పలకడంపై అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. బిజెపిలోని ఓ వర్గానికి సైతం జగన్‌కు మద్దతు ఇవ్వడంపై ఏ మాత్రం ఇష్టం లేనట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రముఖుడైన ఓ బిజెపి నేతతో జగన్ పార్టీకి చెందిన ముఖ్యనేతలకు సంబంధాలు ఉన్నందు వల్లే పార్లమెంటు స్థాయిలో బిజెపి జగన్‌కు మద్దతుగా నిలుస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. సదరు నేతలు ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేతలతో మంతనాలు జరిపి జగన్‌కు మద్దతు ఇవ్వాలని కోరడంతో పాటు ఆయనకు మద్దతు ఇస్తే భవిష్యత్తులో కలిగే లాభాలను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. జగన్‌కు గట్టిగా మద్దతు పలికితే భవిష్యత్తులో ఎన్డీయేకు జగన్ మద్దతు ఇస్తాడని కొందరు అధిష్టానానికి నచ్చజెప్పినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే జగన్‌కు మద్దతు ఇవ్వాలన్న వారి వాదనలతో మరికొందరు రాష్ట్ర నేతలూ విభేదిస్తున్నట్లుగా తెలుస్తోంది. జగన్ తండ్రి వైయస్‌పై బిజెపి చాలా పోరాటాలే చేసింది. అలాంటప్పుడు జగన్‌కు మద్దతు ఇస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని వారు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. జగన్‌కు మద్దతు ఇవ్వడం వెనుక కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సైతం ఉన్నారనే వాదనలూ వినిపిస్తున్నాయి. కర్నాటకలో గాలి సోదరులకు ఆ పార్టీ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ అండ ఉందన్న వాదనలు ఇప్పటికే ఉన్నాయి. దీంతో గాలి జనార్దన్ రెడ్డి సైతం జగన్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా సుష్మాతో సహా బిజెపి నేతలకు విన్నవించుకుని ఉంటాడనేది పలువురి వాదన.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+