వైయస్ జగన్ సాక్షి ఆఫీసులో సిబిఐ మళ్లీ సోదాలు

ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సిబిఐ అధికారులు స్టైలిష్ డైరెక్టర్ రంగారావు నివాసంలో సోదాలు నిర్వహించారు. రంగారావు అమెరికాకు పారిపోయినట్లు అనుమానం రావడంతో ఆయన ఇంటిని శుక్రవారం సిబిఐ అధికారులు సీజ్ చేశారు. శనివారం బంధువుల సమక్షంలో తాళాలు తీసి, సోదాలు నిర్వహించారు.
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సిబిఐ శనివారం సోదాలు కొనసాగిస్తోంది. ఎమ్మార్‌కు చెందిన మూడు కార్యాలయాల్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, హైదరాబాదుల్లోని ఈ కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. సోదాల కోసం సిబిఐ శుక్రవారం కోర్టు నుంచి వారంట్లు పొందింది. ఆ వారంట్ల ప్రకారం తొమ్మిది స్థానాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మార్, ఎపిఐఐసి ఒప్పందంలో వాటాను ఆరు శాతం తగ్గించడం వల్ల ప్రభుత్వానికి 40 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. దీనికి బాధ్యులెవరనే విషయంపై సిబిఐ ఆరా తీస్తోంది. ఎమ్మార్‌కు చెందిన మాజీ అధికారుల్లో కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications